Wednesday, January 22, 2025

యుఎస్‌ఎపై గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా అమెరికాపై భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు యుఎస్‌ఎ ఉంచింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో చెలరేగి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబే కూడా 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. పది పరుగులు వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ సేనకు యుఎస్‌ఎ బౌలర్ల చెమటలు పట్టించారు. రిషబ్ పంత్ 18 పరుగులు చేసి అలీఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు భారత్ ఓడిపోతుందని అంచనాకు వచ్చారు. మూడో వికెట్‌పై సూర్యకుమార్ యాదవ్, శివ దూబే 61 పరుగులు చేసి విజయాన్ని అందించారు. యుఎస్‌ఎ బౌలర్లలో సౌరభ్ నట్రవల్కర్ రెండు వికెట్లు, అలీఖాన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసి అమెరికా నడ్డి విరిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ ఎ నుంచి మూడు మ్యాచ్ లో గెలిచి భారత జట్టు సూపర్8 కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News