Tuesday, December 17, 2024

రెండో టెస్టులో భారత్ గెలుపు…. సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

ఢాకా:  భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను 2-0తో భారత్  కైవసం చేసుకుంది. షీరీ బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో రోజు అశ్విన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడడంతో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (29), రవిచంద్రన్ అశ్విన్(42) పరుగులతో బ్యాటింగ్ చేసి ఓటమి గండం నుంచి తప్పించారు. అక్షర్ పటేల్ 34 పరుగులు చేసి విజయంలో భాగమయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మిహిడీ హసన్ రాజ్ ఐదు వికెట్లు తీసి హడలెత్తించాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశాడు. రెండో టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయడంతో పాటు 54 పరుగులు చేశాడు. దీంతో అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పూజారాకు దక్కింది. సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియాలో ప్రధాన బ్యాట్స్ మెన్లు శుభ్ మన్ గిల్ (07), కెఎల్ రాహుల్ (02), ఛటేశ్వర్ పూజారా(06), విరాట్ కోహ్లీ(01), రిషబ్ పంత్ (09) పరుగులు చేసి విఫలమయ్యారు.

 

 

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 227
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231
భారత్ తొలి ఇన్నింగ్స్: 314

భారత్ రెండో ఇన్నింగ్స్: 145

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News