Monday, February 10, 2025

రెండో వన్డే భారత్‌దే… సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

కటక్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డే సిరీస్ లో ఇప్పటికే టీమిండియా రెండు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 308 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేసి లివింగ్ స్టన్ బౌలింగ్ లో అదిల్ రషీద్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేసి జమీ ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 44 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు.

కెఎల్ రాహుల్ పది పరుగులు చేసి జమీ ఓవర్టన్ బౌలింగ్‌లో సాల్ట్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా పది పరుగులు చేసి గజ్ అట్కిసన్ బౌలింగ్‌లో జమీ ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఓపెనర్లు రోహిత్-గిల్ 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ ఐదు పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అక్షర పటేల్ (41), రవీంద్ర జడేజా (11) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జమీ ఓవర్టన్ రెండు వికెట్లు, అదిల్ రషీద్, లైమ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిసన్ తలో ఒక వికెట్ తీశారు. సెంచరీ చేసిన రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News