Monday, December 23, 2024

సూర్యాకుమార్ సునామీ.. సూపర్-4కు భారత్

- Advertisement -
- Advertisement -

India won on Hankang in Asia cup

దుబాయ్: ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్ పై భారత జట్టు గెలుపొందింది. హాంకాంగ్ పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించడంతో సూపర్-4కు చేరుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి హాంకాంగ్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హాంకాంగ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. సూర్యాకుమార్ సునామీ సృష్టించాడు. సూర్యాకుమార్ 26 బంతుల్లో 68 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ(21), రాహుల్(36) పరుగులు చేసి ఔటయ్యారు.  హాంకాంగ్ బ్యాట్స్ మెన్లలో బాబార్ (41), కించిత్ షా(30), జషన్ అలీ(26) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగితా బ్యాట్స్ మెన్లు నిరాశపరిచారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షదీప్ సింగ్,  జడేజా తలో ఒక వికెట్ తీశారు. పరుగులు సునామీ సృష్టించిన సూర్యాకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. హాంకాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, మహ్మాద్ ఘజన్ ఫర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News