ఫైనల్లో నేపాల్‌ను చిత్తు చేసిన ఖోఖో టీమ్‌లు
అభినందనల వెల్లువ
మొదటిసారిగా ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఖోఖో ప్రపంచ కప్‌లో భారత జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇరు జట్లు ఛాంపియన్స్‌గా అవతరించడంలో ఉత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన మహిళా క్రీడాకారులు, పురుష క్రీడాకారులు, కోచులకు, మేనేజర్లకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అభినందనలు తెలిపింది. అన్ని రాష్ట్రాల అసోసియేషన్లను అభినందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఖోఖో ప్రపంచ కప్‌లో భారత ఖోఖో జట్లు సంచలనం సృష్టించాయి. తొలి టైటిళ్లను కైవసం చేసుకొని ఛాంపియన్స్‌గా అవతరించాయి. ఆదివారం జరిగిన పోరులో భారత మహిళల జట్టు ఏకపక్షంగా 38 పాయింట్ల భారీ తేడాతో నేపాల్‌ను చిత్తు చేయగా.. మరో ఫైనల్ పోరులో పురుషుల జట్టు 18 పాయింట్ల తేడా నేపాల్‌పై గెలుపొందింది. దీంతో ఇటు మహిళల జట్టు, పురుషుల జట్టు ఖోఖో ప్రపంచ కప్ తొలి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఫెవరేట్‌గా బరిలోకి భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనలోల అడు గు పెట్టింది. ఇక ఫైనల్‌లోనూ అదే జోరుతో 78-40 స్కోరు తో నేపాల్‌ను మట్టికరిపించింది.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు తీవ్ర ప్రతిఘనటన ఎదురైంది. నేపాల్ సైతం ప్రతీగా పాయింట్లు సాధిస్తూ టీమిండియాకు ఎదురోడ్డి నిలిచింది. కానీ మరింత ఆత్మవిశ్వాపంతో భారత మహిళలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. మొదటి టర్న్-లో అద్భుత ప్రదర్శనతో నేపాలీ జట్టును డిఫెన్స్‌లో పడేశారు. ప్రత్యర్థి తప్పిదాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని 34-0తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టర్న్‌లో నేపాల్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టి భారత డిఫెండర్లు సులువుగా పాయింట్లు సాధించారు. దీంతో రెండో టర్న్ తర్వాత స్కోరు 35-24గా నిలిచింది. చివరి టర్న్‌లో జోరు పెంచిన భారత మహిళలు నేపాల్‌ను వెనక్కు నెట్టి ఆధిక్యంలోకి దూసెకెళ్లారు. దీంతో చివరి టర్న్ పూర్తయ్యే సమయానికి భారత్ 78-40 స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 176 పాయింట్లతో భారీ విజయాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇదే జోరును టోర్నీ ఆసాంతం కొనసాగించి ఫైనల్‌తో భారత అభిమానులను ఆశలను నిజం చేస్తూ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
పురుషు జట్టు జోరు..
మహిళల జట్టు స్ఫూర్తితోనే పురుషుల జట్టు అదే జోరు కొనసాగించింది. నేపాల్‌తో జరిగిన టైటిల్ పోరులో 5436 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి టర్న్‌లో 2618తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి భారత్ ప్రత్యర్థి జట్టు తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి వరకూ అదే ఆటను కొన సాగించిన నేపాల్ నాలుగో టర్న్‌లో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందకు ప్రయత్నించింది. ఈ రౌండ్‌లో 37 పాయింట్లు అవసముండగా నేపాల్ కేవలం 18 పాయింట్లే రాబట్టి 36 పాయింట్లకే పరిమితం అయ్యింది.