Monday, February 24, 2025

కోహ్లీ శతకం.. భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

దాయాదిపై భారత్ ఘన విజయం
ఆరు వికెట్ల తేడాతో విక్టరీ
విరాట్ శతకంపై ఉత్కంఠ
రాణించిన శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ పాక్ నాకౌట్
ఆశలు గల్లంతు చాంపియన్స్
ట్రోఫీలో సెమీస్‌కు చేరువలో
టీమిండియా దేశవ్యాప్తంగా
అభిమానుల సంబరాలు

దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించించింది. 2017 నాటి ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్పుచుకుంది. చాన్నాళ్ల తరావత కింగ్ కోహ్లీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో 51వ సెంచరీ సాధించాడు. కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46) సహకరించారు. కోహ్లీ, శ్రేయస్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. పాక్ ఫీల్డర్లు క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లీకి కలిసి వచ్చింది. మరోవైపు శ్రేయస్ కూడా సాధికారికంగా ఆడాడు. అనవసర షాట్లు కొట్టకుండా సమయోచితంగా రాణించాడు. తాజా గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలు ఖరారయ్యాయి. వరుస ఓటములతో పాక్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి.

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసింది. పరుగులయంత్రం విరాట్ కోహ్లీ(100) మరోసారి బ్యాట్ ఝలిపించి, శతకొట్టడంతో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మెగాటోర్నీలో రెండో ఓటమిని చవిచూసిన పాక్ సెమీస్ ఆశలు అడియాశలయ్యాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కట్టడిగా బౌలింగ్ చేసిన పాక్‌ను 242 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ (62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్ (46), కుష్దిల్ షా(38) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి.

భారత్‌కు శుభారంభం

అనంతరం లక్ష ఛేదనకు దిగిన టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ 100 (111 బంతుల్లో 7×4) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ 56(67 బంతులు: 5×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. శుభ్‌మన్ గిల్ 46(52 బంతులు: 7×4) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 242 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించడం భారత్‌కు కలిసొచ్చింది. ఓ భారీ సిక్సర్‌తో పాటు మూడు బౌండరీలు బాది భారత ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు. పుల్ షాట్‌తో అతను కొట్టిన భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్గా నిలిచింది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(20)ను షాహిన్ షా అఫ్రిది స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి ఒత్తిడిని తగ్గించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన సింగిల్స్, క్విక్ డబుల్స్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. హ్యారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ట్రేడ్ మార్క్ బౌండరీలతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను అబ్రర్ అహ్మద్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

India won on Pakistan in champion trophy

కోహ్లీ సెంచరీ, అయ్యర్ హాఫ్ సెంచరీ..

బ్యాటింగ్‌తో వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో తీవ్రంగా తడబడ్డ శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత స్విచ్ హిట్, స్వీప్, రివర్స్ స్వీప్లతో ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో అతను 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇమామ్ ఉల్ హక్ స్టన్నింగ్ క్యాచ్‌తో అయ్యార్ వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన పాండ్య సయితం తొలుత దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నం చేశాడు. అయితే రిజ్వాన్ బౌలింగ్ షహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అక్షర్‌మ పటేల్ క్రీజులోకి రావడంతో కోహ్లీకి సెంచరీ వైపు దూసుకెళ్లాడు. 42వ ఓవర్‌లో మూడో బంతికి పరుగులు రాబట్టిన కోహ్లీ వన్డేల్లో 51వ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.

సమష్టిగా రాణించిన భారత బౌలర్లు..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బాబర్ ఆజామ్(23) మరోసారి నిరాశపరిచాడు. మంచి ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజామ్‌ను హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చ పెవిలియన్ చేరాడు. అనంరతం అక్ష ర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఇమామ్ ఉల్ హక్(10) రనౌట్ చేశాడు. దీంతో పాక్ 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్, సౌద్ షకీల్ ఆచితూచి ఆడారు. ఆదుకున్న షకీల్, రిజ్వాన్ నిదానంగా పరుగులు చేశారు. దాంతో చాలా సేపటి వరకు బౌండరీ నమోదు కాలేదు. హాఫ్ సెంచరీ ముంగిట సౌద్ షకీల్ బౌండరీలు కొట్టాడు. దాంతో అతను 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. హాఫ్ సెంచరీ ముంగిట దూకుడుగా ఆడేప్రయ ప్రత్నం చేసిన మహమ్మద్ రిజ్వాన్‌కు ఓ లైఫ్ కూడా లభించింది. అతను ఇచ్చిన క్యాచ్‌ను హర్షిత్ రాణా నేలపాలు చేశాడు.

కానీ ఆ మరుసటి ఓవర్‌లోనే అక్షర్ పటేల్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి 104 పరుగుల భాగస్వామ్యానికి చెక్ పెట్టాడు. కుల్దీప్ తీన్మార్.. ఆ వెంటనేసౌద్ షకీల్ క్యాచ్ ఇవ్వగా.. కుల్దీప్ యాదవ్ నేలపాలు చేశాడు. కానీ ఆ తరువాతి ఓవర్‌లో పాండ్యా అతన్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా(19)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. తయ్యబ్ తాహిర్(4)ను జడేజా క్లీన్ బౌల్ చేశాడు. షాహిన్ షా అఫ్రిది(0)ని డకౌట్ చేసిన కుల్దీప్.. మరో ఓవర్లో నసీమ్ షా(14)ను ఔట్ చశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు కుష్దీల్ షా ఒంటరిపోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతనే మూడు సిక్సర్‌లు బాదాడు నమోదు చేశాడు. 43 ఓవర్ల వరకు ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ నమోదు కాలేదు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఓ సిక్స్ బాదిన కుష్దిల్ షా.. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు బాదాడు. హర్షిత్ రాణాను అక్షర్ పటేల్ రనౌట్ చేయగా.. ఆఖరి ఓవర్‌లో కుష్దిల్ షా క్యాచ్ ఔటవ్వడంతో 242 పరుగుల వద్ద పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News