Saturday, November 16, 2024

విరాట్ ధమాకా

- Advertisement -
- Advertisement -

ఒంటిచేత్తో ఆదుకున్న కోహ్లీ.. ఛేజింగ్ అద్భుతం

ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ విజయం

చివరి బంతి వరకూ చిరకాల ప్రత్యర్థిపై ఉద్వేగభరిత పోరు టీ20 వరల్డ్‌కప్‌లో
టీమిండియా శుభారంభం దేశవ్యాప్తంగా అభిమానుల సంబురాలు ఒక్కరోజు
ముందే దీపావళి తెచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రముఖుల ప్రశంసల వెల్లువ

మామూలుగానే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్‌కి ఉండే క్రేజే వేరు..! అదే ప్రపంచకప్‌లో ఈ రెండు దేశాలు తమ తొలి మ్యాచ్‌లో ఒకరికొకరు ఢీకొంటే .. ఆ మ్యాచ్ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగితే.. వింటేనే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదూ..! అవును.. క్రికెట్ ప్రపంచమంతా ఊహించినట్టు అదే జరిగింది! ఆదివారం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో దాయాది దేశాలు ఆడిన తీరు అటు స్టేడియంలో, ఇటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులను కళ్లు తిప్పనివ్వలేదు! ముఖ్యంగా చివరి ఆరు బంతుల్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం. అందరిలో ఒకటే టెన్షన్.. అందరిదీ ఒకటే ప్రార్థన.. ఎలాగైనా భారత జట్టు గెలవాలని. అందరి ప్రార్థనలూ ఫలించాయి. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఒకరోజు ముందుగానే దేశానికి దీపావళి తెచ్చింది. ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించిన మిషన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 (6 బౌండరీలు 4 సిక్సర్లు, నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్‌లో టీమిం డియా శుభారంభం చేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. దాయాది టీం పాకిస్థాన్‌తో జరిగిన హైటైన్ష ఫన్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) అద్భుతమైన ఆటతీరుతో ఓటమి నుంచి విజయ తీరాలకు చేర్చాడు. 31 పరు గులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటిం గ్‌తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటిం గ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలు పొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవ ర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ చెరో వికెట్ పడగొట్లారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40) రాణించాడు.

31 పరుగులకే 4 వికెట్లు..
168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(4), రోహిత్(4) శర్మ వెను వెంటనే ట్ అయ్యారు. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కెఎల్ రాహుల్ బంతి వికెట్లపై ఆడుకోని పెవిలియన్ దారి పట్టగా.. హారిస్ రౌఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు బౌండరీలతో దూకుడుగా ఆడినా అతని జోరుకు హరీస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. షాట్ పిచ్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా మూడు వికెట్లకు 31 పరుగులు మాత్రమే చేసింది. ఇక అక్షర్ పటేల్‌ను టాపార్డర్ బ్యాటర్‌గా ప్రమోట్ చేస్తూ రోహిత్‌సేన చేసిన ప్రయోగం ప్లాప్ అయ్యింది. అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ రనౌట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. బంతి కన్నా ముందే రిజ్వాన్ గ్లోవ్స్ వికెట్లను తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. దాంతో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఆదుకున్న కోహ్లీ, పాండ్యా..
క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు జాగ్రత్తగా, వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఆడటంతో భారత్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జోరు కనబర్చిన ఈ జోడీ.. మహ్మద్ నవాజ్ వేసిన 12 ఓవర్లలో మూడు సిక్స్‌లు బాదారు. ఆ తర్వాత అదే జోరు కనబరుస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. హరీస్ రౌఫ్, నసీమ్ షా 16,17 ఓవర్లు కట్టడిగా వేయడంతో టీమిండియా రిక్వైడ్ రన్‌రేట్ బాగా పెరిగింది. షాహిన్ షా వేసిన 18 ఓవర్లలో విరాట్ కోహ్లీ మూడు బౌండరీలు బాది 17 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సస్పెన్స్ థ్రిల్లర్..
చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. షాదాబ్ ఖాన్ వేసిన తొలి బంతికి క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ సింగిల్ తీయగా.. మూడో బంతికి విరాట్ క్విక్ డబుల్ తీసాడు. నాలుగో బంతిని నోబాల్‌గా వేయగా విరాట్ కోహ్లీ సిక్స్‌గా మలిచాడు. దాంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీ హిట్ బాల్‌ను వైడ్‌గా వేయడంతో 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే మరుసటి బంతికి విరాట్ క్లీన్ బౌల్ అవ్వగా.. ఫ్రీ హిట్ కావడంతో భారత బ్యాటర్లు చాకచక్యంగా 3 పరుగులు తీసారు. దాంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితిసీంది. ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో అశ్విన్ సింగిల్ తీసి భారత్ విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News