Monday, January 20, 2025

అర్షదీప్ అదరహో.. భారత్ జయహో!

- Advertisement -
- Advertisement -

చెలరేగిన బౌలర్లు..
116 పరుగలకే దక్షిణాఫ్రికా చిత్తు
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. దివారం స్టేడియంలో వాండరర్స్ సఫారీలతో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీలు నిర్ణయించిన 117 స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6×4, 1×6), అరంగ్రేట బ్యాటర్ సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9×4) అర్ధ శతకాలతో రాణించారు. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్, ఫెహ్లుక్వాయోలు చెరో దక్కించుకున్నారు.

సఫారీలకు చుక్కలు..

తొలుత టాస్ గెలుపొంది బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు అర్షదీప్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిర అర్షదీప్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (0)ను డకౌట్ చేసి, మరుసటి బంతికే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రస్సీ వాన్‌డర్ డస్సెన్(0)ను పరుగులేమి చేయనివ్వకుండానే పెవిలియన్ పంపాడు. దీంతో ఆతిధ్య జట్టు 3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మరో ఓపెనర్ టోని డి జోర్జీ (28) ఆచీతూచి ఆడుతూ వికెట్లు పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో 7వ ఓవర్ వేసిన అర్షదీప్ అదే ఓవర్‌లో ఐదో బంతికి, హెన్రిచ్ క్లాసెన్ (6)ను క్లీన్‌బౌల్ చేసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

10 ఓవర్లలోపే సౌతాఫ్రికా 4 వికెట్లు కూల్చాడు. ఇక 11 ఓవర్ బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్, వరుస తొలి రెండు బంతుల్లో ఎయిడెన్ మర్‌క్రమ్ (12), వియాన్ ముల్దార్ (0)ను ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక తన తర్వాతి ఓవర్లోనే ఆవేశ్, డేవిడ్ మిల్లర్ (2)ను వెనక్కిపంపాడు. కాసేపు టెయిలెండర్ ఫెహ్లుక్వాయో (33) కాసేపు ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరును 100 దాటించాడు. ఫెహ్లుక్వాయోనే టాప్ స్కోరర్ కావడం విశేషం. చివరికి అతడిని ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన అర్షదీప్, వన్డే కెరీర్‌లో నాలుగో మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులోకి ఎక్కాడు. ఇక స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆఖరి వికెట్ పడగొట్టి సఫారీ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

ఇదే అత్యల్ప స్కోరు..

వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికాకు సొంతగడ్డపై ఇదే అత్యల్ప స్కోర్. 2018లో సఫారీ గడ్డపై 118 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది. అప్పుడు కూడా టీమ్‌ఇండియా చేతిలోనే కావడం విశేషం. ఓవరాల్‌గా సౌతాఫ్రికాకు ఇది పదో అత్యల్ప స్కోర్. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 69 పరుగులకు ఆలౌటైంది. వన్డే క్రికెట్‌లో ఇదే దక్షిణాఫ్రికా జట్టుకు అత్యల్ప స్కోర్. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

తొలి భారత పేసర్‌గా..

దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ అర్షదీప్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సఫారీ గడ్డపై ఇద్దరు బౌలర్లు ఐదేసి వికెట్టు పడగొట్టారు. 1999లో సునీల్ జోషి (5/6) వికెట్లు పడగొట్టగా 2018లో యాజువేంద్ర చాహల్ (5/22) పడగొట్టాడు. కానీ వారు ఇరవురూ స్పిన్నర్లు. దాంతో పేసర్‌గా అర్షదీప్‌కు అరుదైన రికార్డు దిక్కింది. ఇక 2013లో సెంచూరియన్ వేదికగా జరిగిన వన్డేలో భారత పేసర్ ఇషాంత్ శర్మ (4/40) వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఇషాంత్ శర్మ పేరున ఉండేది. కాగా, అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News