Sunday, December 22, 2024

స్పిన్ తో వరుణ్ మాయ… గెలిచింది దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

జికెబెర్రా: సెయింట్ జియోర్జ్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టి20లో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. రెండో టి20లో మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు గెలిచింది. టీమిండియా తొలుత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అనంతర దక్షిణాఫ్రికా జట్టు 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి స్పిన్‌తో మాయ చేసినప్పటికి చివరలో ఫేస్ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. భారత బ్యాట్స్‌మెన్లలో సంజూ శామ్సన్(0), అభిషేక్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(4) నిరాశ పరిచారు. హర్దిక్ పాండ్యా(39), అక్షర పటేల్(27), తిలక్ వర్మ(20) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ట్రిస్టన్ స్టబ్స్ 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీరిస్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు 1-1 సమవుజ్జీలుగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో వరుణ్ ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లను వణికించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News