Sunday, January 19, 2025

విశాఖ టెస్టు మనదే..

- Advertisement -
- Advertisement -

చెలరేగిన అశ్విన్, బుమ్రా
ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
1-1తో సిరీస్ సమం

విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత సిరీస్‌ను 11తో సమం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన మొద టి టెస్టులో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే. 399 పరుగుల క్లిష్టమైన లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ సోమవారం నాలుగో రోజు 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. 67/1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ జాక్ క్రాలీ అండగా నిలిచాడు. అతనికి నైట్‌వాచ్‌మన్ రెహాన్ అహ్మద్ సహకారం అందించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందు కు నడిపించారు. అయితే 31 బంతుల్లో ఐదు ఫోర్లతో 23 పరుగులు చేసిన రెహాన్‌ను అక్షర్ వెనక్కి పంపాడు.

దీంతో 45 పరుగుల రెండో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత వచ్చిన ఓలి పోప్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ 21 బంతుల్లో ఐదు ఫోర్లతో 23 పరుగులు చేసిన పోప్‌ను అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. కొద్ది సేపటికే జో రూట్ కూడా ఔటయ్యాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 16 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన రూట్‌ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రాలీ తన పోరాటాన్ని కొనసాగించాడు. అయితే 132 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి చివరికి కుల్దీప్ వేసిన అద్భుత బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
బుమ్రా జోరు..
కొద్ది సేపటికే జానీ బెయిర్‌స్టో కూడా ఔటయ్యాడు. 36 బం తుల్లో ఐదు ఫోర్లతో 26 పరుగులు చేసిన బెయిర్‌స్టోను బు మ్రా ఎల్బీగా ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టో క్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 29 బంతు ల్లో ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసిన స్టోక్స్‌ను శ్రేయస్ అయ్యర్ రనౌట్ చేశాడు. ఈ దశలో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్ద రు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు చేసిన ఫోక్స్‌ను బుమ్రా ఔట్ చేశాడు.

ఆ వెంటనే టామ్ హార్ట్‌లీ (36)ను కూడా బుమ్రా వెనక్కి పంపాడు. బుమ్రా అద్భుత బంతితో హార్ట్‌లీను క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు షోయబ్ బషీర్ (0) ను ముకేశ్ కుమార్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 292 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. కుల్దీప్, ముకేశ్, అ క్షర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో తొమ్మి ది వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పో షించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

డబ్లూటిసిలో రెండో స్థానం..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించడం టీమిండియాకు కలిసి వచ్చింది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆరో స్థానంతో సరిపెట్టుకున్న టీమిండియా విశాఖ టెస్టు విజయంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం భారత్ 52.77 శాతంతో టాప్2లో నిలిచింది. ఆస్ట్రేలియా 55 శాతంతో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక భారత్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News