Monday, December 23, 2024

విండీస్ పై గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

India won on west indies

ట్రినిడాడ్: క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. మూడు పరుగులతో తేడాతో విండీస్ పై భారత జట్టు గెలుపొందింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో కెల్ మార్స్(75), బ్రాండన్ కింగ్ (54) హాఫ్ సెంచరీలు చేయగా మిగతా వారు షామార్హ బ్రుక్స్ (46), నికోలస్ పూరన్ (25), అకీల్ హుస్సేన్(32) నాటౌట్, రోమారియో షెపార్డ్(39) నాటౌట్, షై హోప్ (07), రోవాన్ పావెల్ (06) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో మహ్మాద్ సిరాజ్, శార్థూల్ టాకూర్, యుజేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. 97 పరుగులు చేసిన భారత్ కెప్టెన్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News