Monday, January 20, 2025

తొలి ట్వంటీలో భారత్‌దే విజయం…

- Advertisement -
- Advertisement -

India won on West Indies in T20

ట్రినిడాడ్: బ్రియన్ లారా స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టి ట్వంటీలో భారత జట్టు విజయం సాధించింది. విండీస్ పై టీమిండియా 68 పరుగుల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌటైంది. విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రూక్స్(20), పాల్(19) నాటౌట్,  నికోలస్ పూరన్(18), మేయిర్స్ (14), పావెల్(14), హెట్ మెయిర్(15), అఖీల్ హోసన్(11), జోషప్(05) నాటౌట్ పరుగులు చేశారు. ఓల్డ్ స్మిత్, హోల్డర్ డకౌట్ రూపంలో వెనుదిరిగారు. భారత్ బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ(64), కార్తీక్(41) నాటౌట్, సూర్యాకుమార్(24), పంత్ (14), రవీంద్ర జడేజా(16), అశ్విన్ (13) నాటౌట్ పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రవీచంద్ర అశ్విన్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా చెరో ఒక వికెట్ తీశారు. విండీస్ బౌలర్లలో జోషఫ్ రెండు వికెట్లు తీయగా మెక్ కాయ్, హోల్డర్, హోసన్, కీమో పాల్ తలో ఒక వికెట్ పడగొట్టారు. 19 బంతుల్లో 41 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News