Friday, January 24, 2025

వంద పరుగుల తేడాతో గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

హరారే: హరారే స్పోర్ట్ క్లబ్‌లో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. జింబాబ్వే జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి జింబాబ్వే ముందు 235 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో వెస్టే మదేవెరె(43), లుకె జోంగ్వే(33), బ్రయిన్ బెన్నెట్(26) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అవేష్‌ఖాన్, ముకేష్ కుమార్ చెరో మూడు వికెట్లు తీయగా రవి బిష్ణోయ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఐదు టి20ల సిరీస్‌లో భారత్-జింబాబ్వే 1-1తో సమంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News