Saturday, November 16, 2024

ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కు పసిడి

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. మంగళవారం మూడో రోజు భారత్ ఈక్వస్ట్రియన్ టీమ్ విభాగంలో పసిడిని సొంతం చేసుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత జట్టు ఈక్వస్ట్రియన్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ క్రీడాంశంలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం. చివరిసారి భారత్ ఈ విభాగంలో 1982లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన అప్పటి ఆసియా క్రీడల్లో భారత్ ఈక్వస్ట్రియన్ విభాగంలో ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి పెను సంచలనం సృష్టించారు. ఆ తర్వాత భారత్ ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక భారత బృందం అసాధారణ ప్రతిభతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి జట్ల నుంచి ఎదురైన గట్టి పోటీని సయితం తట్టుకుంటూ భారత టీమ్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకాన్ని దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News