Monday, December 23, 2024

రెండో టి20లో భారత్ గెలుపు

- Advertisement -
- Advertisement -

India won the second T20 against australia

నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టి20లో భారత్ ఆరు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ 1-1తో సమం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ప్రతికూల వాతావరణం వల్ల నాగ్‌పూర్ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లోనే 31 పరుగుల చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ మాథ్యూవేడ్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 20 బంతుల్లోనే అజేయంగా 43 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 7.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో అజేయంగా 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News