Monday, December 23, 2024

స్విమింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: యూరప్ ఖండంలోని సెరిబియా దేశ రాజధాని బెల్‌గ్రేడ్‌లో జరిగిన వరల్డ్ ఓపెన్ వాటర్ పిన్ స్విమింగ్ ఛాంపియ న్ షిప్ పోటీలలో హైదరాబాద్‌లోని బర్కత్‌పురకు చెందిన గంధం క్విని విక్టోరియా (40+వయస్సు) సత్తాచాటారు. భారతదేశం తరుపున పాల్గొన్న క్విని విక్టోరియా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించారు. గత నెల సెప్టెంబర్ 24నుంచి 30వ తేదీ వరకు జరిగిన స్విమింగ్ చాంపియన్ షిప్ పోటీలలో క్విని విక్టోరియా 3 కిలోమీటర్ల మెనోఫిన్‌లో గోల్డ్ మెడల్, 1కిలోమీటర్ మోనోఫిన్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారత కీర్తి పతకాన్ని నలు దిశల చాటిచెప్పింది. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలు పాల్గొనగా గోల్డ్ మెడల్

సాధించిన తొలి భారతీయురాలుగా క్వీని విక్టోరి యా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా బెల్‌గ్రేన్ నుంచి క్వీని విక్టోరి యా మాట్లాడారు. స్విమ్మింగ్‌లో భారతదేశం తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. తాను సాధిం చిన గోల్డ్, సీల్వర్ మెడల్స్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంకితం చేస్తు న్నానని ఆమె తెలిపారు. ఈ చాం పియన్ షిప్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని, భారత్ తరుపున తొలి మహిళాగా ఈ పోటీలలో పాల్గొన్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పలువురు ప్రముఖులు క్విని విక్టోరియాకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News