Monday, January 20, 2025

తొలి వన్డే భారత్‌దే..

- Advertisement -
- Advertisement -

బార్బడాస్: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్ (43) ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. మిగతా వారిలో బ్రాండన్ కింగ్ (17), అలిక్ (22), హెట్‌మెయిర్ (11) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిడియా 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News