Thursday, January 23, 2025

భారత్ గెలిస్తే చరిత్రే!

- Advertisement -
- Advertisement -

కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా
నేటి నుంచి చివరి టెస్టు

అందరి కళ్లు కోహ్లిపైనే..

India won will create record

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా కోహ్లి సాధించలేదు. ఇక సిరీస్‌లో కూడా ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. రెండో టెస్టులో బరిలోకి దిగలేదు. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో బ్యా టింగ్‌ను కనబరచలేక పోయాడు. ఒకప్పుడూ అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస సెంచరీలతో ప్రకంపనలు సృష్టించిన కోహ్లి ఇటీవల కాలం లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇటు టెస్టులు, అటు వన్డేల్లో సెంచరీలు సాధించక ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఇలాంటి స్థితిలో మూడో టెస్టులో అతను ఈ లోటును పూడ్చుకుంటాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాల్సి న అవసరం ఉంది. రెండో టెస్టులో రిషబ్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో చివ రి టెస్టు అతనికి సవాల్‌గా మారింది. కాగా, అశ్విన్, శార్దూల్‌లు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు కిందటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఘోరంగా విఫలం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. బౌలర్ల వైఫల్యం వల్ల గెలిచే మ్యాచ్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో వారు ఎలా రాణిస్తారనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

కేప్‌టౌన్ : సౌతాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉ న్న టెస్టు సిరీస్ విజయాన్ని ఈసారైనా టీమిండి యా సాధిస్తుందా అంటే అది తేలికేం కాదనే చె ప్పాలి. ఎందుకంటే జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరగిన రెండో టెస్టులో భారత్ ఓటమి దీనికి ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో మంగళవారం ప్రారంభమయ్యే మూడో చివరి టెస్టుకు దక్షిణాఫ్రికా సమరోత్సాహంతో సిద్ధమైం ది. మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కొత్త చరిత్ర అవిష్కృతమవుతుంది. దశాబ్దాలుగా సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలుపు లోటు తీరుతోం ది. ఇక ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకున్నాడు. దీంతో అతని సారథ్యంలోనే భారత్ చివరి టెస్టులో బరిలోకి దిగనుంది. అదే జరిగితే తెలుగుతేజం హనుమ విహారి పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఇక హైదరాబాదీ స్పీ డ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ కూడా ఆఖరి టెస్టులో పా ల్గొనేది కష్టమే. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడడం దాదాపు అసాధ్యమే. అదే జరిగితే సీనియర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్‌లలో ఒకరు బరిలోకి దిగడం ఖాయం.
ఓపెనర్లు కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్‌లు కీలకంగా మారారు. వీ రిద్దరూ మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ రాణించినా జ ట్టుకు మెరుగైన స్కోరు ఖాయం. రెండో టెస్టులో వీరి వైఫల్యం జట్టును వెంటాడింది. ఈసారి వీరి బాధ్యత మరింత పెరిగింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని మంచి ఆరంభాన్ని ఇస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గుతోంది.
ఈసారి రాణిస్తారా..
కిందటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు మెరుగైన ప్రదర్శన చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఇద్దరు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఒత్తిడిలోనూ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రహానె, పుజారాలకు ఈ మ్యాచే చివరి అవకాశంగా చెప్పాలి. ఇందులో రాణిస్తేనే రానున్న సీజన్‌లలో టీమిండియాలో చోటు నిలుపుకునే అవకాశాలుంటాయి. ఒకవేళ విఫలమైతే మాత్రం మళ్లీ జాతీయ జట్టులో స్థాంన పొందడం అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సమరోత్సాహంతో..
రెండో టెస్టులో అనూహ్య విజయం సా ధించిన సౌతాఫ్రికా చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉం ది. జోహెన్నస్‌బర్గ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా సమష్టిగా రాణించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈసారి కూడా జ ట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. డుసెన్, పీటర్సన్, మార్‌క్రామ్, బవుమా తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ బ లంగా ఉంది. అంతేగాక ఎంగిడి, ర బాడ, జాన్‌సెన్‌లతో బౌలింగ్ విభా గం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News