Friday, January 17, 2025

విశ్వవిజేత భారత్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్‌పై 7వికెట్ల తేడాతో గెలిచిన షెఫాలీసేన
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టిటాస్ సాధు
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గ్రేస్ స్క్రీవెన్స్
తొలి ఐసిసి వరల్డ్‌కప్ టీమిండియా కైవసం

అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్లో అమ్మాయిల గెలుపు

పొచెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్ 19 టి20 ప్రపంచకప్ ప్రారంభ ఎడిషనల్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీవర్మ భారత అమ్మాయిల జట్టు ఇంగ్లాండ్‌పై 7వికెట్ల తేడాతో విజయం సాధించి నిలిచింది. భారత దళం ధాటికి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చిత్తుగా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 17.1ఓవర్లలో కేవలం 68పరుగులే చేసి ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారతజట్టు 14ఓవర్లలో 3వికెట్ల నష్టానికి చేసి ఛేదించింది. నాలుగు ఓవర్లలో 6పరుగులిచ్చి 2వికెట్లతో మెరిసిన టిటాస్ సాధు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

కాగా తొలుత టాస్ గెలిచిన 19 అమ్మాయిల జట్టు బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రేస్ స్క్రీవెన్స్, లిబర్టీ హిప్ ఓపెనింగ్ జోడీ జట్టుకు శుభారంభాన్ని అందించడంలో విఫలమైంది. లిబర్టీ పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగింది. టిటాస్ సాధు తత్తరపాటుకు గురైన లిబర్టీహిప్ సాధుకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకుంది. తొలి పరుగు ఖాతాలో నమోదవగానే ఇంగ్లాండ్ మొదటివికెట్ పడింది. నియామ్ హోలాండ్‌ను అర్చనాదేవీ క్లీన్‌బౌల్డ్ చేయగా కెప్టెన్ స్క్రీవెన్స్ వికెట్ కూడా పడగొట్టింది.

ఒక్క పరుగు తేడాలోనే ఇంగ్లాండ్ రెండు కీలక వికెట్లు పడిపోవడంతో ఇంగ్లీష్ జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలర్లు ఆద్యంతం పట్టువిడవకపోవడంతో స్క్రీవెన్స్ సేన పరుగుల రాబట్టడంలో విఫలమైంది. 17.1ఓవర్లలో 68పరుగులు చేసి చాప చుట్టేసింది. 24బంతుల్లో 3ఫోర్లుతో 19పరుగులు చేసిన టాప్‌స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలింగ్ దళంలో టిటాస్ సాధు, అర్చనాదేవీ, పార్శవీ చోప్రా తలో రెండు వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షెఫాలీవర్మ, యాదవ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం నిర్దేశించిన లక్ష ఛేదనలో ధనాధన్ షెఫాలీవర్మ ఓ ఫోరు, ఓ సిక్సర్‌తో 15పరుగులు చేసి ఔటైంది.

శ్వేత షెరావత్ (5) ఎకువసేపు క్రీజులో నిలవలేకపోయింది. ఈనేపథ్యంలో సౌమ్య తివారీ, గొంగిడి త్రిష ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని గెలుపు బాటలో నిలబెట్టారు. సౌమ్య బంతుల్లో 3ఫోర్లుతో 24పరుగులుచేసి అజేయంగా నిలవగా, త్రిష 29బంతుల్లో 3ఫోర్లుతో చేసి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకుంది. మొత్తంమీద ఆరుఓవర్లు మిగిలి ఉండగానే వికెట్ల నష్టానికి చేసి విజయం సాధించింది. తుదిపోరులో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన సేన విశ్వవిజేతగా నిలిచింది.

మెరిసిన తెలుగు తేజం త్రిష

ప్రపంచ కప్ టైటిల్ పోరులో తెలుగు తేజం గొంగడి త్రిష సత్తా చాటింది. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష పైనల్లో బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో మెరిసింది. తొలుత ఇంగ్లాండ్ కెప్టెన్ స్క్రీవెన్స్‌ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించింది. నాలుగో ఓవర్ చివరి బంతిని ఫుల్‌టాస్ వేయగా టేగ్రేస్ స్క్రీవెన్స్ భారీషాట్‌కు యత్నించింది. గాల్లోకి లేచిన బంతిని నేలను తాకుతుండగా అద్భుతంగా ముందుకు డైవ్ చేసిన త్రిష కళ్లు చెదిరే క్యాచ్‌తో స్క్రీవెన్స్‌కు షాక్ ఇచ్చి పెవిలియన్‌కు పంపింది. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలక పరుగు లు సాధించి జట్టు విజయానికి దోహదపడింది. కుడిచేతివాటం బ్యాటరైన త్రిష ఫైనల్లో 29బంతుల్లో 3బౌండరీలతో 24పరుగులు చేసి తివారీ తో కలిసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News