Monday, December 23, 2024

‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్…ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్ 2’ త్వరలో రాబోతున్నది. ఆయన ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను ఆయన షేర్ చేసుకున్నారు. ఇదివరలో ఆయన ‘ఇండియన్’ సినిమా 1996లో విడుదలై హిట్ కొట్టింది. అందులో అవినీతిని ఎదుర్కొన్న తీరును చూయించారు. ఎస్. శంకర్ దర్శకత్వంలో మళ్లీ  సీక్వెల్ తీయబోతున్నారు.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా కొత్త పోస్టర్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ సీక్వెల్ సినిమా జూన్ 2024లో విడుదల కానున్నది. తెలుగులో ‘భారతీయుడు 2’ గా, హిందీలో ‘హిందుస్థానీ 2’ అన్న పేర్లతో ఈ సినిమా రాబోతున్నది. తమిళ ఉగాది(నూతన సంవత్సరం) సందర్భంగా కమల్ హాసన్ ఈ పోస్టర్లను 14 ఏప్రిల్ 2024న (ఆదివారం) విడుదల చేశారు.

‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, వివేక్, కాళిదాస్ జయరామ్, ప్రియా భవానీ శంకర్, గురు సోమసుందరం, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News