Thursday, December 19, 2024

అందరినీ ఆకట్టుకునే మంచి సందేశాత్మక చిత్రం

- Advertisement -
- Advertisement -

యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఈ మీడియా సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలో నుంచి వచ్చినట్టే ఉంటాయి. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేసేది.. రెండోది మన బాధ్యతది చెప్పేది. సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ డిఫరెంట్‌గా ఉంటాయి”అని అన్నారు. శంకర్ మాట్లాడుతూ “భారతీయుడు టైంలో సీక్వెల్ తీస్తానని అనుకోలేదు. ఆ మూవీ తరువాత ఇన్నేళ్లలో ఎక్కడ లంచం తీసుకున్నారనే వార్తలు చదివినా నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు.

కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. 2.ఓ తరువాత నాకు స్టోరీ కుదరడం, కమల్ హాసన్‌కి చెప్పడంతో ఈ సినిమా మొదలైంది. నేను ఓ సీన్‌ను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది. అందరినీ ఆకట్టుకునే మంచి సందేశాత్మక చిత్రమిది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది”అని తెలిపారు. సురేష్ బాబు మాట్లాడుతూ “ట్రైలర్ చూసిన వెంటనే శంకర్ నంబర్ కనుక్కుని మెసెజ్ చేశాను. కమల్ హాసన్ మన ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సోషల్ మెసేజ్ ఇస్తూ, ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేస్తూ తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. అటువంటి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News