Tuesday, January 21, 2025

ఓటీటీలో ఇండియన్ 3 సినిమా..?

- Advertisement -
- Advertisement -

భారతీయ సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎవరంటే కచ్చితంగా ఎస్ ఎస్ రాజమౌళి అనే అంటారు. కానీ, ఒకప్పుడు విఎఫ్ఎక్స్, కమర్షియల్ సినిమా విషయంలో భారతీయ సినిమాని హాలీవుడ్ లో సెట్ చేసిన డైరెక్టర్ శంకర్ అని చెప్పవచ్చు. శంకర్ అప్పట్లోనే తమిళ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చేశారు. కానీ, ఇటీవల శంకర్ తీస్తున్న సినిమాలు అతని అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

అయితే, డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తన వరుస సినిమాలతో డిజాస్టర్స్ ని అందిస్తున్నారు. హీరో విజయ్ నటించిన స్నేహితుడు సినిమా మొదలుకానుంచి ఇటీవల రిలీజ్ అయిన కమలహాసన్ ఇండియన్ 2 వరుసగా థియేటర్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ కారణంగానే ఇండియన్ 3 మూవీ థియేటర్లో విడుదల కాకుండా నేరుగా ఓటీడీలో నేరుగా రిలీజ్ అవుతుందని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి. ఇండియన్ 3 సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కానుందని బాగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజం అయితే ఇది డైరెక్టర్ శంకర్ కు పెద్ద అవమానం అని చెప్పవచ్చు.

ఈ రూమర్స్ ని ఖండిస్తూ డైరెక్టర్ శంకర్ ఇటీవల తమిళనాడులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. ఇండియన్ 2 సినిమాకి ఇలా నెగటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని చెప్పారు. కానీ, ఇండియన్ 3 మాత్రం కచ్చితంగా వర్కౌట్ అవుతుందని శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ 3 చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటిలో రిలీజ్ కాదని పూర్తిగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News