Monday, December 23, 2024

హెరాన్ డ్రోన్.. క్యా సీన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన నాలుగు అత్యంత శక్తివంతమైన పర్యవేక్షక డ్రోన్లను సంతరించుకుంది. ఆదివారం వాయుసేనలోకి సరికొత్త హెరాన్ మార్క్ 2 డ్రోన్లు వచ్చిచేరినట్లు అధికారులు నిర్థారించారు. ఒకేసారి చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి నిశితమైన నిఘాను నిర్వహించేందుకు అవసరం అయిన సాధనసంపత్తి వీటికి ఉంది. దీనితో శత్రుసేనల కదలికలను, ఉగ్రమూకల అక్రమ చొరబాట్లను సకాలంలో పసికట్టేందుకు వీలేర్పడుతుంది. ఈ నాలుగు జమజ్టెట్టీ డ్రోన్ల నిర్వహణను చేపట్టే దళానికి ‘ఉత్తర దిక్కు రక్షక్’ అని పేరు పెట్టారు. ఈ డ్రోన్లకు శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్‌లు ఉంటాయి. సాయుధ బలగాలకు సంబంధించి ఇవి అధునాతన శ్రేణికి చెందినవి. ఈ డ్రోన్లు చాలా సమర్థవంతమైనవని ఈ డ్రోన్ల దళాధిపతి వింగ్ కమాండర్ పంకజ్ రాణా వార్తాసంస్థలకు తెలిపారు.

సుదీర్ఘకాలం మనగల్గడం, కనుచూపు మేరకు ఆవలి వీక్షణ సామర్థం దీని ప్రత్యేకత అని వివరించారు. వీటిని వినియోగించుకోవడం ద్వారా వాయుసేన ఉన్నచోటు నుంచే యావత్తూ దేశాన్ని తగు విధంగా పర్యవేక్షించగల్గుతుందని స్కాడ్రన్ లీడర్ పంకజ్ తెలిపారు. ఈ డ్రోన్లు ఒక్కసారి గాలిలోకి ఎగిరితే ఏకబిగిన 36 గంటల పాటు పయనించగలవు. పనిచేయగలవు. ఈ డ్రోన్లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. *నిశితమైన లేజర్ వ్యవస్థ *ఆపరేషన్ మధ్యలోనే మరో దిశకు మారే శక్తియుక్తులు *ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను తీసుకువెళ్లగలవు* ప్రత్యేకమైన బాంబులను మోసుకువెళ్లుతాయి. *అత్యవసర నిఘా సమాచార సేకరణ* అత్యల్ప మైనస్ స్థాయి ఉష్ణోగ్రతలలో కూడా దూకుడే సరిహద్దుల్లో మొహరించుకుని ఉండే మన మిగ్ 29 ఫైటర్లకు ఇవి కుడిభుజంగా మారుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News