కన్నడలో మాట్లాడే వ్యక్తులు కొందరు బెంగళూరులో సోమవారం తెల్లవారుజామున ఓ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్)ని బైక్‌పై వెంబడించి దుర్భాషలాడి, దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన భార్యతో కలిసి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన భార్య స్కాడ్రన్ లీడర్ మధుమితా దత్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ ద్విచక్రంపై తనను వెంటాడిన వక్తులు తనపై దుర్భాషలాడి, దాడిచేశారని ఆరోపించారు.
ఆయన ఇన్‌స్టాగ్రాంలో సంఘటన క్రమాన్ని వివరిస్తూ ముఖంపై, మెడపై అయిన గాయాలను చూయించారు. ఆ గాయాల నుంచి రక్తం కారుతున్న వీడియోను షేర్ చేశారు. ‘కర్నాటక చాలా ఘోరంగా తయారయింది. ఇక్కడ శాంతిభద్రతలు విఫలమైతే, నేను ప్రతీకారం తీర్చుకుంటాను’ అని ఆయన తన వీడియోలో తెలిపారు. ఆయన బెంగళూరులోని సివి.రామన్ నగర్ ఫేజ్1లోని డిఆర్‌డివోలో నివసిస్తున్నారు. తన ఇంటి నుంచి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.