Monday, December 23, 2024

వచ్చే ఏడాది నుంచి భారత వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరులు

- Advertisement -
- Advertisement -

 

Chief Air Marshal

చండీగఢ్: వచ్చే ఏడాది నుంచి భారత వైమానిక దళం మహిళా అగ్నివీరులను చేర్చుకోబోతోందని భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ప్రకటించారు. ఆయన చండీగఢ్‌లో శనివారం ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే’ సందర్భంగా ఈ విషయం తెలిపారు. ‘ఇందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కొత్త ఆయుధాల శాఖను కూడా ఏర్పాటు చేయనున్నాం. అగ్నివీరులకు సంబంధించిన ఆపరేషన్ ట్రయినింగ్ పద్ధతిని కూడా మార్చబోతున్నాం’ అని ఆయన తెలిపారు.
“ప్రభుత్వం కూడా భారత వైమానిక దళంలో ఆఫీసర్ల కోసం ఆయుధ విధానం శాఖ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను’అని వివేక్ రామ్ చౌదరి తెలిపారు. అంతేకాక “ప్రతి అగ్నివీర్‌కు తగిన నైపుణ్యం,జ్ఞానం అబ్బేలా శిక్షణ విధానంలో మార్పులు తెచ్చాం. ఆరంభ శిక్షణకుగాను ఈ ఏడాది డిసెంబర్‌లో 3000 మందిని ‘అగ్నివీర్ వాయు’గా చేర్చుకుంటున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరుగనుంది” అంది ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News