వాషింగ్టన్: అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ జింగ్ సంధు గురువారం వైట్ హౌస్ ఫెలోషిప్‌లో పాల్గొని వివిధ రంగాలకు చెందిన యువ నాయకులతో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, పెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికా మధ్య మైత్రీ, సంబంధాల గురించి ఆయన చర్చించారు. వైట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ఈసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఈ సమావేశం జరిగినట్లు సంధూ ట్వీట్ చేశారు. భారత్-అమెరికా సంబంధాలు, ప్రాంతీయ అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఇంధన; పర్యావరణ, ఐటి, విద్య వంటి వివిధ అంశాలకు సంబంధించి యువ అమెరికన్ నాయకులతో విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. 1964లో వైట్ హౌస్ ఫెలోషిప్‌ను స్థాపించారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో పనిచేసే ప్రత్యక్ష అనుభవాన్ని యువ నాయకులకు కల్పించడానికి ఈ ఫెలోషిప్‌ను వైట్ హౌస్ ఏర్పాటుచేసింది. బైడెన్ ప్రభుత్వంలో ఫెలోషిప్‌కు ఆహ్వానం పొందిన తొలి వ్యక్తి సంధూ కావడం విశేషం.
Indian Ambassador in US interacts with White House fellows