Sunday, January 19, 2025

ఖతార్ జైలులో మాజీ నేవీ సిబ్బందితో భారత రాయబారి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉరిశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని ఖతార్‌లోని భారత రాయబాది గత ఆదివారం(డిసెంబర్ 3) కలుసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిన్దమ్ బగ్చి గురువారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జైలులో ఉన్న భారత నౌకాదళ మాజీ సిబ్బందిని మన రాయబారి కలుసుకున్నారని తెలిపారు. ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆయన ప్రస్తావిస్తూ ఇప్పటివరకు రెండు సార్లు విచారణ(నవంబర్ 13, నవంబర్ 30) జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని తాము నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన న్యాయ, కాన్సులర్ సహాయాన్ని అందచేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇది చాలా సున్నితమైన అంశమని, అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని బగ్చి చెప్పారు. తదుపరి విచారణ త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఖతార్ నిఘా సంస్థ గత ఏడాది ఆగస్టులో 8 మంది భారతీయ మాజీ నౌకాదళ సిబ్బందిని అరెస్టు చేసింది. అనంతరం వీరికి ఉరిశిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన సిఓపి 28 సదస్సు సందర్భంగా ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ మిన్ హమాద్ అల్ థానీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అంశాలతోపాటు ఖతార్‌లోని భారతీయ పౌరుల భద్రతపై కూడా వారి మధ్య చర్చలు జరిగినట్లు బగ్చి తెలిపారు. అయితే వారి మధ్య నావికా సిబ్బంది ఉరిశిక్ష అంశం చర్చకు వచ్చిందీ రానిదీ అధికారికంగా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News