Tuesday, January 21, 2025

నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందన్న ఆరోపణలకు ఆధారాలేవి ?

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్ అధికారి తన బహిరంగ ప్రకటనల ద్వారా తారుమారు చేశారని అక్కడి భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ది గ్లోబ్ అండ్ మెయిల్ అనే పత్రికతో మాట్లాడుతూ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలను బలపర్చే ఆధారాలుంటే సమర్పించాలని డిమాండ్ చేశారు. జూన్‌లో నిజ్జర్ హత్య తరువాత కెనడా పోలీసులు చేపట్టిన దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో వారికి భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలు మాత్రం ఇప్పటివరకు సమర్పించలేదన్నారు. ఆధారాలు ఎక్కడున్నాయి ? దర్యాప్తులో ఏమి తేలింది ? నేను ఒక అడుగు ముందుకేసి చెబుతున్నాను. కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత్ కానీ, భారత్ ఏజెంట్లు కానీ ఉన్నట్టు చెప్పాలని కెనడా లోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయని వర్మ ఆరోపించారు. గత ఐదారు సంవత్సరాల్లో దోషులను అప్పగించాలని కెనడాకు భారత్ 26 అభ్యర్థనలు చేసిందని, అయినా కెనడా ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు. తనకు ఇతర భారత దౌత్య సిబ్బందికి కెనడాలో భద్రతా పరమైన బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News