Thursday, January 23, 2025

న్యూయార్క్ ఎంటిఎ బోర్డుకు ఇండియన్ అమెరికన్ అటార్నీ మీరా జోషి నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంటిఎ) బోర్డుకు సేవ చేసేందుకు ఇండియన్ అమెరికన్ అటార్నీ మీరా జోషి నియామకమయ్యారు. న్యూయార్క్ సిటీ మేయర్ ఏరిక్ ఆడమ్స్ ఈమేరకు నియామకం చేశారు. 2022 జనవరి నుంచి జోషి న్యూయార్క్ సిటీ ఆపరేషన్స్ డిప్యూటీ మేయర్‌గా ఉంటున్నారు. ఆడమ్స్ నిర్వహణ లోని రవాణా సౌకర్యాలు, వాతావరణ శాఖలను ఆమె చూస్తున్నారు.

ఈ నియామకానికి సంబంధించి గత వారం విడుదలైన ప్రకటనలో ఎంటిఎ భవిష్య పురోగతిని సాధించగల సరైన వ్యక్తి జోషి అని, రవాణాలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు , భద్రత, అనుసంధానం సాధించగలరని ఆడమ్ అభిలషించారు. న్యూయార్క్ ప్రజలందరికీ రవాణా సౌకర్యాలు అందుబాటు లోకి తీసుకురాడానికి విశేష కృషి చేయగలరన్న విశ్వాసం తమకు ఉందని ఆడమ్ ప్రకటనలో పేర్కొన్నారు. న్యూయార్క్ సిటీ రవాణా వ్యవస్థ తమ వెన్నుముక వంటిదని, ఈ వెన్నుముక బలంగా ఉండేలా జోషి ప్రయత్నించగలరని పేర్కొన్నారు. న్యూయార్క్ స్ట్రీట్ సేఫ్టీవర్క్ నిర్వహణలో జోషి కీలక పాత్ర వహించారు. 2023లో ఈ వ్యవస్థ న్యూయార్క్ సిటీని ప్రపంచం లోనే పాదచారులకు రెండో భద్రతా నగరంగా గుర్తింపు పొందడానికి సహకరించింది. జోషి బృందాలు న్యూయార్క్ నగరం లోని భవనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను అదుపు చేసి హరిత ప్రాంతంగా తీర్చి దిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News