- Advertisement -
అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్‌ను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు క్యాపిటల్ హిల్ నుంచి వైట్ హౌస్ వరకు జరగనున్న పరేడ్‌లో భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నది. టెక్సాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘శివం ఢోల్ తాషా పాఠక్’కు ఆహ్వానం అందింది.
ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణం చేసే వేళ ఆ భారత ఢోల్ బ్యాండ్ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించనున్నది. తమకు దక్కిన ఈ అవకాశంతో భారత ఢోల్ బ్యాండ్‌లో ఉన్న హై ఎనర్జీని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తామని శివం ఢోల్ తాషా పాఠక్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెరుగుతున్న గుర్తింపునకు ఇది నిదర్శనమని పలు మీడియా వర్గాలు వ్యాఖ్యానించాయి.
- Advertisement -