- Advertisement -
న్యూయార్క్ : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన జొన్నలగడ్డ శ్రీనివాస మూర్తి తన కొడుకును రక్షించబోయి తాను మృతి చెందారు. 12 ఏండ్ల తన కుమారుడిని తీసుకుని కాలిఫోర్నియాలోని బీచ్‌కు వెళ్లిన మూర్తి కొడుకు పెను కెరటానికి కొట్టుకుపోతూ ఉండగా రక్షించేందుకు ముందుకు వెళ్లాడు. ఏదో విధంగా కొడుకును బయటకు తీసుకురాగల్గినా వెంటనే దూసుకువచ్చిన భారీ కెరటంతో మూర్తి కెరటాల ధాటికి కొట్టుకుపోయ్యాడు.
తీరం వెంబడి నిలబడి ఉన్న మూర్తి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవల్సి వచ్చింది. పాంథర్ బీచ్ వెంబడి జరిగిన ఈ ఘటనలో మూర్తితో కలిసి బాలుడిని కాపాడిన ఓ వ్యక్తి క్షేమంగా బయటకు వచ్చారు. మూర్తికి ఈత రాదని, కెరటం వెంట కొట్టుకుపోయి తిరిగి తీవ్రంగా గాయపడిన స్థితిలో తీరంవద్దకు చేరిన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -