Thursday, January 23, 2025

ఆర్థికవేత్త రాజ్ చెట్టికి అత్యున్నత హార్వర్డ్ వర్శిటీ బహుమతి

- Advertisement -
- Advertisement -

హౌస్టన్ : భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త రాజ్‌చెట్టికి హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన అత్యున్నత గౌరవ ప్రదమైన జార్జి లెడ్లీ బహుమతి లభించింది. చెట్టితోపాటు బయోలజిస్ట్ మైకేల్ స్ప్రింగర్‌కు కూడా ఈ బహుమతి లభించింది. హార్వర్డ్ యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్న రాజ్ చెట్టి ఆపర్టూనిటీ ఇన్‌సైట్స్ అనే సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక చలనశీలతపై అద్భుతమైన అధ్యయనం చేశారు. ఈమేరకు విధాన నిర్ణేతలతో భారీ డేటాను పంచుకుని, అపోహలను ఛేదించ గలిగారని, అందరికీ అమెరికా స్వప్నాన్ని అందుబాటు లోకి తెచ్చారని యూనివర్శిటీ అత్యున్నత ప్రధానాధికారి,

చీఫ్ అకడమిక్ ఆఫీసర్ అలాన్ ఎం. గార్బెర్ ప్రశంసించారు. బయోలజిస్టు మైకేల్ స్ప్రింగర్ హెచ్‌ఎంఎస్‌లో సిస్టమ్స్ బయోలజీలో ప్రొఫెసర్ గా ఉన్నారు. కొవిడ్ తీవ్రంగా వ్యాపించే సమయంలో కొవిడ్ పరీక్షల ప్రక్రియను నాణ్యతగా, వేగంగా అందేలా కృషి చేశారు. న్యూ హార్వర్డ్ యూనివర్శిటీ క్లినికల్ లేబొరేటరీని రూపకల్పన చేయడంలోను, నిర్వహణ లోను సహకరించారు. మైకేల్, రాజ్ వీరిద్దరూ తమ రంగాల్లో విశిష్టమైన పరిశోధకులుగా పేరు గడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News