Thursday, November 14, 2024

అత్యంత ప్రతిభావంత విద్యార్థిగా 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక

- Advertisement -
- Advertisement -

Indian-American girl declared one of brightest students

 

వాషింగ్టన్: నటాషా పెరీ అనే 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే స్కాలెస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్), అమెరికన్ కాలేజి టెస్ట్(యాక్ట్) పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు నిర్వహించే మరో పరీక్షలోనూ ఆమె అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు సాధించారు. 2021లో జాన్స్ హాప్కిన్స్ నిర్వహించిన సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్(సిటివై) సెర్చ్ పరీక్షలో పెరీ 90 శాతం మార్కులతో అడ్వాన్స్‌డ్ గ్రేడ్ విద్యార్థిగా ప్రతిభ సాధించారు.

దాంతో, ఆమెను జాన్స్‌హాప్కిన్స్ సిటివై హైహానర్స్ అవార్డ్‌కు ఎంపిక చేశారు. సిటివై సెర్చ్ పరీక్ష రాసిన వారిలో 20 శాతానికన్నా తక్కువే ఈ అవార్డ్‌కు ఎంపికవుతారు. 202021 ఏడాదికి ఈ అవార్డ్‌కు 84 దేశాలకు చెందిన 19,000మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అవార్డ్‌కు ఎంపికైనవారికి హైస్కూల్,కాలేజీ, ఇంకా ఉన్నత చదువులకు సహాయమందిస్తామని సిటివై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్జీనియా రోచ్ తెలిపారు. న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్‌మీర్ ఎలిమెంటరీ స్కూల్‌లో పెరీ ఐదో గ్రేడ్ చదువుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News