Saturday, November 23, 2024

పక్షవాత లక్షణాలను తక్షణం గుర్తించే పోర్టబుల్ ఎంఆర్‌ఐ సాధనం

- Advertisement -
- Advertisement -

Indian-American led research team finds portable MRI devices

యేల్ వర్శిటీ పరిశోధకుల రూపకల్పన

హోస్టన్ : పక్షవాతం, గుండెపోటు వచ్చే రోగుల్లో క్లిష్టమైన వైద్య లక్షణాలను తక్షణం గుర్తించ గలిగే పోర్టబుల్ మేగ్నెటిక్ రిసొనాన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) పరికరాన్ని యేల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించ గలిగారు. ఇండో అమెరికన్ ప్రొఫెసర్ కెవిన్ సేథ్ ఆయన సహచర పరిశోధక బృందం ఈ పరికరాన్ని రూపిందించారు. ఎవరికైనా పక్షవాత లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు ఆ రోగి పరిస్థితి ఏమిటో వెంటనే నిర్ణయించలేక పోతుంటారు. అలాంటి సంక్లిష్టమైన కేసులు కొన్నిటిలో మెదడులో రక్తం గడ్డకట్టకుండా పల్చన చేయడం అవసరమౌతుంది. మరికొన్ని కేసుల్లో మెదడులో రక్తం చిమ్మడం కొనసాగితే వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం కీలకమైన అంశం. అలాంటప్పుడు పోర్టబుల్ ఎంఆర్‌ఐ సాధనం డాక్టర్లకు నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కపాలం లోపల రక్తస్రావం (ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్ )ను డాక్టర్లు వెంటనే గుర్తించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యంత ఆధునిక బ్రెయిన్ ఇమేజ్ స్కాన్లు అందుబాటులో లేని చోట ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News