Friday, December 20, 2024

బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్‌కు కీలక పదవి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త , మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు ,షమీనా సింగ్‌ను ఎగుమతుల మండలి సభ్యురాలిగా బైడెన్ నియమించారు. ఈమేరకు శ్వేతసౌధం ప్రకటన వెల్లడించింది. ఈ నియామకంపై షమీనా ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎగుమతుల కమిటీలో చేరడం గర్వంగా ఉందన్నారు. ఈ మండలి, అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది.

వాణిజ్యం, ఎగుమతుల విస్తరణ, వాణిజ్య సంబంధ అంశాలపై ప్రభుత్వ విధానాలు , కార్యక్రమాలకు ఈ మండలి అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటుంది. షమీనా సింగ్ గతం లోనూ శ్వేతసౌధం, ప్రతినిధుల సభలో కీలక పదవులు చేపట్టారు. ఆసియాన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్‌పై మొదటి అధ్యక్ష సలహా కమిషన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2015 లో అమెరికార్ప్ బోర్డు సభ్యురాలిగా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెను నియమించారు. బైడెన్ యంత్రాంగంలో ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా బారత అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా షమీనా సింగ్ కూడా ఈ జాబితాలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News