Monday, December 23, 2024

అంతర్జాతీయ సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరస్పర శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

జమ్ము : భారత్‌పాక్ దేశాల మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వివిధ చెక్‌పోస్టుల వద్ద గురువారం 74 వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉభయ దేశాల సైనిక దళాలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నాయి. మిఠాయిలు పంచుకున్నాయి. సరిహద్దు భద్రతా దళాలు పాక్ రేంజర్లకు స్వీట్లు అందించగా, పాక్ సైనికులు కూడా భారత దళాలకు స్వీట్లు అందించాయి. అఖ్‌నూర్, సాంబ, కతువా, ఆర్నియా, ఆర్‌ఎస్ పుర, అవుట్‌పోస్టుల్లో స్వీట్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ నియంత్రణ రేఖ వద్ద కూడా ఉభయ దేశాల సైనికులు పరస్పరం స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

జమ్ము లోని ఫ్రాంటియర్ ప్రధాన కేంద్రం వద్ద రిపబ్లిక్ డే వేడుక జరిగింది. భద్రతా దళాల ఇన్‌స్పెక్టర్ జనరల్ డికె బూర జాతీయ జెండాను ఎగుర వేశారు. సరిహద్దుల్లోను, నియంత్రణ రేఖ వద్ద విధుల్లో ఉన్న సీమ ప్రచారిస్‌కు వారి కుటుంబాలకు కూడా డికె బూర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సరిహద్దు భద్రతా దళాల అపూర్వ త్యాగాలను గుర్తు చేశారు. భారతీయుల భద్రత కోసం భద్రతా దళాలు నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని , దేశ భద్రత కోసం నిత్యం అంకితమవుతున్నారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News