Saturday, November 23, 2024

లడఖ్‌లో చైనా సైనికుడి చొరబాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ మీదుగా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక చైనా సైనికుడిని తూర్పు లడఖ్‌లో భారతీయ సైన్యం శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. గత మూడు నెలల్లో ఈ రకమైన అక్రమ చొరబాటు చోటుచేసుకోవడం ఇది రెండవవసారి. గత ఏడాది మే నెలలో పాంగాంగ్ సరస్సు సమీపంలో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ చెలరేగిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో రెండు దేశాలకు చెందిన సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లడఖ్‌లో మోహరించాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) సైనికుడిని శుక్రవారం ఉదయం పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

సైనిక నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటున్నామని, ఎల్‌ఎసి మీదుగా అతను భారత భూభాగంలోకి ఎలా చొరబడ్డాడో ప్రశ్నిస్తున్నామని సైనిక వర్గాలు తెలిపాయి. కాగా.. గత అక్టోబర్ 19న ఎల్‌ఎసి మీదుగా లడఖ్‌లోని దెమ్‌చోక్ సెక్టార్‌లోకి చొరబడిన చైనా పిఎల్‌ఎకు చెందిన కార్పొరల్ వాంగ్ యా లాంగ్ అనే సైనికుడిని భారతీయ దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనలను అనుసరించి అతడిని తూర్పు లడఖ్‌లోని చుషూల్-మాల్డో సరిహద్దు పాయింట్ వద్ద చైనాకు అప్పగించడం జరిగింది.

Indian Army Apprehends Chinese Soldier in Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News