Friday, December 27, 2024

దెమ్‌చోక్‌లో భారత సైన్యం గస్తీ మొదలు

- Advertisement -
- Advertisement -

భారత సైన్యం దెమ్‌చోక్‌లో గస్తీని శుక్రవారం ప్రారంభించిందని, తూర్పు లడఖ్‌లోని రెండు వివాద ప్రాంతాలోత భారత, చైనా సేనల ఉపసంహరణ పూర్తి అయిన కొన్ని రోజుల తరువాత ఇది పునఃప్రారంభమైందని సైనిక దళ వర్గాలు వెల్లడించాయి. దెప్సాంగ్‌లో గస్తీ త్వరలో తిరిగి మొదలు కాగలదని ఆ వర్గాలు తెలియజేశాయి. తూర్పు లడఖ్‌లోని దెమ్‌చోక్, దెప్సాంగ్ మైదాన ప్రాంతాల్లో రెండు ఘర్షణ ప్రదేశాల్లో భారత, చైనా సైనికులు పూర్తిగా వెనుకకు మరలారని, ఆ ప్రదేశాల్లో గస్తీ త్వరలోనే ప్రారంభం కాగలదని సైనిక దళ వర్గాలు బుధవారం తెలియజేశాయి. ఆ మరునాడు దీపావళి సందర్భంగా భారత.

చైనా జవాన్లు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) పొడుగునా పలు సరిహద్దు కేంద్రాల్లో మిఠాయిలు పంచుకున్నారు. రెండు ఘర్షణ ప్రదేశాల వద్ద సేనల ఉపసంహరణను రెండు దేశాలు పూర్తి చేసి, భారత, చైనా సంబంధాల్లో సరికొత్త శాంతిని తెచ్చిన తరువాత ఒక రోజు సాంప్రదాయక పద్ధతి పాటించారు. సేనల ఉపసంహరణ పూర్తి అయిన తరువాత నిర్ధారణ ప్రక్రియ సాగుతోందని, గ్రూప్ కమాండర్లు గస్తీ విధివిధానాలను నిర్ణయిస్తారని ఆ వర్గాలు ఇంతకు ముందు తెలిపాయి. స్థానిక కమాండర్ స్థాయిలో చర్చలు కొనసాగుతాయని ఆ వర్గాలు చెప్పాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News