Wednesday, January 22, 2025

అమరజవాన్ కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్‌కు కీర్తిచక్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో అమరుడైన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్‌కు మరణానంతర కీర్తిచక్ర అవార్డు నిర్ణయిమైంది. మరోముగ్గురు ఆర్మీ జవాన్లకు కూడా కీర్తి చక్ర అవార్డు నిర్ధారించారు. వారిలో రైఫిల్‌మేన్ రవికుమార్ (మరణానంతర), మేజర్ మల్లరామగోపాల నాయుడు, డిఎస్‌పి (జమ్ముకశ్మీర్ పోలీస్) హిమయూన్ ముజ్జమిల్ భట్ లకు కీర్తిచక్ర అవార్డు వచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయుధ దళాలకు, కేంద్ర సాయుధ పోలీస్ అధికారులకు మొత్తం 103గాలంట్రీ అవార్డులు ప్రదానం చేస్తారు. నాలుగు కీర్తిచక్రలు, గాలంటరీ అవార్డులతోపాటు 18 శౌర్యచక్రలు (నలుగురికి మరణానంతరం), ఒక విశిష్ట సేనా మెడల్, 63 సేనా మెడల్స్, 11 నవోసేనా మెడల్, 6 వాయుసేనా మెడల్స్ అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News