Monday, December 23, 2024

ఇండియన్ ఆర్మీ ‘ఎక్సర్‌సైజ్ టాప్చీ’

- Advertisement -
- Advertisement -

నాసిక్ : నాసిక్ లోని దేవ్‌లాలీలో స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ ఆధ్వర్యంలో భారత ఆర్మీ ఆదివారం ‘ఎక్సర్‌సైజ్ టాప్చీ’ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా స్వదేశీయంగా తయారైన కె 9 వజ్ర, ఎస్‌పి గన్ సిస్టమ్, ధనుష్, 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్, లైట్‌ఫీల్డ్ గన్, వ్యవస్థలు, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాయుధ దళాల సంసిద్ధత, చెక్కు చెదరని సంకల్పం ప్రదర్శించడానికే ఇదంతా. వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీస్టూడెంట్ ఆఫీసర్స్, పుణె డిఫెన్స్ సర్వీసెస్ టెక్నికల్ స్టాఫ్ కోర్స్, నేపాల్ ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ , ఇండియన్ ఆర్మీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్ సెర్వింగ్ ఆఫీసర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News