Monday, December 23, 2024

టెర్రరిస్టుల తూటాలకు ఆర్మీ డాగ్ బలి

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లో ఉగ్రవాదుల తూటాలకు ఓ సైనిక శునకం బలి అయింది. ఈ ఘటన జమ్మూ ప్రాంతంలోని అక్నూర్‌లో సోమవారం జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. వీర మరణం పొందిన ఈ ఆర్మీడాగ్ ఫాంథోమ్ సేవలు చిరస్మరణీయం అని ప్రకటనలో తెలిపారు. అక్నూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులతో వైట్‌నైట్ కార్ప్ సైనిక దళాల ఎన్‌కౌంటర్ జరిగింది. దళానికి తోడుగా ఉండే సైనిక శునకం ఈ ఎన్‌కౌంటర్ దశలో ఉగ్రవాదుల తూటాలు తగిలి, తీవ్రంగా గాయపడి తరువాత చనిపోయిందని వెల్లడించారు. ఈ మూగజీవి ధైర్యం , విశ్వాసం, అంకితభావం ఎనలేనిదని , శాల్యూట్ అని స్పందించారు. నిజమైన హీరో అని తెలిపారు. తమ దళం టెర్రరిస్టులను చుట్టుముట్టిన క్రమంలోనే జరిగిన కాల్పుల్లో ఈ శునకం మృతి చెందింది. ఒక్క టెర్రరిస్టును పట్టుకున్నారని , భారీ ఆయుధ సామాగ్రిని స్వాధీనపర్చుకున్నారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News