Sunday, February 23, 2025

జవాన్ల కోసం తొలి 3డి ప్రింటెడ్ హౌస్ నిర్మించిన సైనిక ఇంజనీర్లు

- Advertisement -
- Advertisement -

3D houses for Jawans
 గుజరాత్: డిజిటలైజ్డ్ నిర్మాణాలు విస్తరించే దిశలో భారత సైనిక ఇంజనీర్లు 3డి రాపిడ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి మూడు వారాల్లో రెండు ఇళ్లను నిర్మించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్‌లోని ఆగ్నేయ ఎయిర్ కమాండ్‌లో నిర్మించిన రెండు 3డి ప్రింటెడ్ ఇళ్లు దేశంలోనే ఈ కోవకు చెందిన మొట్టమొదటి నిర్మాణాలు. 3డి ప్రింటెడ్ గృహాలు భారత సాయుధ దళాల వసతి అవసరాలను త్వరగా తీర్చడానికి వేగవంత నిర్మాణ ప్రయత్నాలకు ప్రతీక అని రక్షణ సేవలు(డిఫెన్స్ సర్వీసెస్) తెలిపాయి. ‘ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా, రక్షణ సాంకేతికతల స్వదేశీకరణపై దృష్టి సారించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో భారత సాయుధ బలగాల సంఘీభావానికి ఈ నిర్మాణాలు నిదర్శనంగా నిలుస్తాయి’ అని ప్రకటన పేర్కొంది. చెన్నైకు చెందిన స్టార్టప్ టివస్తా సహకారంతో వీటిని నిర్మించారు. ఒక్కో ఇంటిని 700 చ.అ.గుల విస్తీర్ణంలో నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News