Wednesday, January 22, 2025

ప్రపంచం లోనే అత్యుత్తమ సాయుధ దళాల్లో భారత్ సైన్యం ఒకటి : ఐఎఎఫ్ చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మొత్తం పోరాట క్షేతంలో ఎదురయ్యే సవాళ్లను కాలానుగుణంగా ఎదుర్కొంటూ ప్రపంచం లోనే అత్యుత్తమ సాయుధ దళాల్లో ఒకటిగా భారత్ సాయుధ దళం రూపాంతరం చెందిందని ఐఎఎఫ్ చీఫ్ , ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరీ ఆదివారం వెల్లడించారు. 8 వ సాయుధ దళాల యోధుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ కంటోన్మెంట్ లోని మానెక్‌షా సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, త్రివిధ దళాల్లోని వివిధ సీనియర్ అధికారులు, భారీ సంఖ్యలో అనుభవజ్ఞులైన యోధులు, ఆయా కుటుంబీకులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

90 ఏళ్ల క్రితం మామూలుగా ప్రారంభమైన భారత వైమానిక దళం ప్రపంచం లోనే అత్యంత బలీయమైన వైమానిక దళంగా ఎదిగిందని ప్రశంసించారు. సర్వీస్‌లో కేవలం 91 ఏళ్ల యువ సేవైన ఐఎఎఫ్ 2023 డిసెంబర్ 31 నాటికి 2,21,204 మంది అనుభవజ్ఞులతో బలోపేతమైందని ప్రశంసించారు. ఈ సేవాదళంలో అనేక సమస్యలున్నాయని, వాటిని నిరంతరం పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. నేరుగా పెన్షన్లు అందే వ్యవస్థ లోకి 1.85 లక్షల వారసత్వ పెన్షనర్లు చేరారని వివరించారు. ఇప్పుడు నేవీ పోరాటానికి సిద్ధంగా, నమ్మకంగా, భావి ఆదర్శ ప్రామాణిక శక్తిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News