Saturday, November 23, 2024

కొవిడ్‌పై పోరులో నేపాల్‌కు భారత్ అండ

- Advertisement -
- Advertisement -

Indian Army hands over medical equipment to Nepal

రూ. 18 కోట్ల వైద్య పరికరాల అందజేత

న్యూఢిల్లీ: కొవిడ్-19పై పోరాటంలో నేపాల్‌కు సంఘీభావం, సన్నిహిత సహకారం తెలియచేసే చర్యలలో భాగంగా ఆ దేశానికి రూ. 18 కోట్ల విలువైన వెంటిలేటర్లు, అంబులెన్సులతోసహా వైద్య పరికరాలను భారత్ అందచేసింది. తుండిఖేల్‌లోని నేపాల్ సైనిక ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశంలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నేపాల్ సైన్యాధ్యక్షుడు జనరల్ పూర్ణచంద్ర థాపర్‌కు వైద్య సామగ్రిని అందచేశారు. కలసికట్టుగా కొవిడ్-19ని ఎదుర్కొనే చర్యలలో భాగంగా నేపాల్‌కు వైద్య పరికరాలను అందచేసినట్లు నేపాల్‌లోని భారత రాయబారి కార్యాలయం ట్వీట్ చేసింది. భారత సైన్యం ఈ వైద్య సామగ్రిని సమకూర్చిందని నేపాల్ ఆర్మీ ప్రతినిధి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్ అందచేసిన వైద్య సామగ్రిలో వెంటిలేటర్లు, అంబులెన్సులు, ఐసియు పడకలు, పిపిఇ కిట్లు, పిసిఆర్ టెస్ట్ కిట్లు మొదలైనవి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News