Monday, December 23, 2024

సొరంగం రెస్కూ ఆపరేషన్‌లోకి సైన్యం ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం రంగప్రవేశం చేసింది. సొరంగంలో ఇరుక్కు పోయిన అమెరికన్ ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది. ఇందుకోసం ఆర్మీ తమ పరికరాలను కొండపైకి తరలిస్తోంది.800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్‌చేసి ఇన్‌సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాల్లో చిక్కుకున్నాయి. దీంతో బ్లేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఫలితంగా సొరంగానికి కొండపైనుంచి తవ్వకాలు జరిపి బాధితులను చేరుకునే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్‌నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు.ఆగర్ యంత్ర బాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఈ పని ఆదివారం సాయంత్రానికల్లా పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరో వైపు ్ర సిల్కియా సొరంగంపైన కొండపైనుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేయడం ద్వారా బాధితులను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ పని ఇప్పటికే ప్రారంభమయిందని, 15 మీటర్ల డ్రిల్లింగ్ ఇప్పటికే పూర్తయిందని ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ ఎండి మహమూద్ అహ్మద్ ఆదివారం ఘటనా స్థలం వద్ద బీడియాకు చెప్పారు. డ్రిల్లింగ్ సాఫీగా కొనసాగుతోందని, ఎలాంటి అడ్డకులూ ఎదురుకాని పక్షంలో కొండపైనుంచి సొరంగంలో చిక్కుకున్న బాధిత కార్మికులను చేరుకోవడానికి దాదాపు 100 గంటలు పడుతుందని ఆయన చెప్పారు. క్రిస్మస్ నాటికల్లా కార్మికులను బైటికి తీసుకు రాగలమన్న విశ్వాసాన్ని అంతర్జాతీయ టన్నెల్ డ్రిల్లింగ్ నిపుణుడు డిక్స్ వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 26నుంచి 28 దాకా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడం డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. కానీ 29నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పడం ఊరట కలిగించే అంశం. చార్‌ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం ఈ నెల 12న కూలిపోవడంతో 41 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు సొరంగంలో చిక్కుకుపోయి ఇప్పటికి 15 రోజులయింది.

సొరంగాన్ని డ్రిల్లింగ్ చేసి పైపులను చొప్పించడం ద్వారా బాధిత కార్మికులను బైటికి తీసుకు రావడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాదాపు 86 మీటర్ల సొరంగ మార్గంలో మరో 10 12 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి చేస్తే కార్మికులను చేరుకోవచ్చని భావిస్తున్న తరుణంలో డ్రిల్లింగ్ జరుపుతున్న అమెరికన్ ఆగర్ మిషిన్ బ్లేడ్లకు ఇనుప వస్తువు అడ్డుపడడంతో బ్లేడ్లు విరిగిపోయి డ్రిల్లింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సొరంగంపైనుంచి డ్రిల్లింగ్ చేయడం ద్వారా బాధితుల వద్దకు చేరుకోవాలని అధికారులు భావించారు. కాగా గత 15 రోజులుగా సొరంగంలో చిక్కుపడిన కార్మికలుకు పైపు మార్గం ద్వారా ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను పంపిస్తున్నారు. అప్పుడప్పుడు వారితో కుటుంబ సభ్యులు, అధికారులు కూడా మాట్లాడుతూ, వారిని ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News