కాన్పూర్(యుపి): దేశం సురక్షితంగా ఉందని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌కు చెందిన మందుగుండుతో కూడిన డ్రోన్లు ఇటీవల జమ్మూ కశ్మీరు వైమానిక స్థావరంపై జరిపిన దాడి గురించి సోమవారం నాడిక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ దేశం పూర్తి సురక్షితంగా ఉందని చెప్పారు. దేశంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లకు సంబంధించి ఎవరికీ హెచ్చరికలు జారీచేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. న్యాయం, మానవత్వం ప్రాతిపదికగా అధికార బిజెపి రాజకీయాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. కుల, మతాల ప్రాతిపదికన బిజెపి ఎన్నడూ రాజకీయాలు చేయలేదని ఆయన చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరుపై ఎటువంటి ఫిర్యాదులు లేవని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు.
Indian Army prepared to face any challenges: Rajnath Singh