Monday, December 23, 2024

సైనికుడిని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన శునకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్న బృందం కెంట్‌ను కూడా తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు , భద్రతా దళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. ‘ఆపరేషన్ సుజలిగాల ’లో భాగంగా ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను అనుసరిస్తోంది. ఈ సమయంలో ఉగ్రవాదులను పసిగట్టిన శునకం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే ఇరు వర్గాల మధ్యభారీగా కాల్పులు జరగ్గా ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో కెంట్ వారికి ఎదురుగా వెళ్లింది. భారీ కాల్పుల మధ్య ఆ శునకం తీవ్రంగా గాయపడి మరణించింది.

కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం ఎక్స్( ట్విటర్)లో నివాళులు అర్పిస్తూ ‘ఇది ఎంతో విచారకరమైన వార్త.. 21 వ ఆర్మీ డాగ్ యూనిట్ లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ శునకం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం ఇది ’ అని పేర్కొంది. ఇక ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా, ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు ఓ ప్రత్యేక పోలీస్ అధికారికి గాయాలు అయ్యాయని జమ్ము జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేశ్ సింగ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News