Monday, November 18, 2024

ఎల్‌ఓసి దాటి వచ్చిన ముగ్గురు పిల్లలను పిఓకెకు పంపివేసిన సైన్యం

- Advertisement -
- Advertisement -

Indian Army repatriates 3 children to PoK

జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) మీదుగా భారత భూభాగంలోకి చొరబడిన ముగ్గురు పిల్లలను పూంచ్‌లో అదుపులోకి తీసుకున్న భారత సైన్యం వారిని శుక్రవారం పిఓకెకు సురక్షితంగా పంపించివేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నెల 18న ముగ్గురు పిల్లలను పూంచ్‌లో సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ముగ్గురు పిల్లల వయసు తొమ్మిది నుంచి 17 సంవత్సరాల మధ్య ఉంటుందని ఆయన చెప్పారు. నాలుగో వ్యక్తి సైన్యాన్ని చూసి వెనుదిరిగి పిఓకెలోకి పారిపోయాడని, మైనర్‌గా కనిపిస్తున్న ఆ పిల్లవాడిపై సైన్యం ఎటువంటి కాల్పులు జరపలేదని ఆయన చెప్పారు. తాము ఎల్‌ఓసి వెలుపలి ఛత్ర, త్రోటి ధర్మశాల్‌కు చెందినవారమని ఆ పిల్లలు చెప్పినట్లు ఆయన తెలిపారు. నది, కాలువల ఒడ్డు నుంచి ఇసుకను తవ్వి తీసుకెళ్లే కార్మికులమని, చేపల వేట కోసం తాము ఎల్‌ఓసి దాటామని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News