Sunday, January 5, 2025

జీవన్మరణపు నిండుచూలాలికి పునర్జన్మ

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : దేశ వీరజవాన్లు ఓ నిండుచూలాలు ప్రాణం నిలబెట్టి తమ గొప్పతనం చాటుకున్నారు. గురువారం రాత్రి చాలా పొద్దుపోయిన దశలో భారీగా మంచుపడుతున్నప్పుడు అత్యయిక స్థితిలో ఉన్న గర్భిణిని ఆదుకుని సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ఓ వైపు కాన్ను నొప్పులు , మరో వైపు అనారోగ్య స్థితితో నూన్వాని పంచాయతీలోని దామ్నీ గ్రామంలో నసీమ్ ఖామ్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లుతున్నపుడు సైనికులు ఆదుకున్న ఘటన జరిగింది. రోడ్లపై భారీ మంచుతో అంబులెన్స్ ముందుకు కదలని స్థితిలో పరిస్థితి గురించి స్థానిక ఆశావర్కరు ఒకరు సైన్యానికి సమాచారం అందించారు.

ఓ గర్భిణి ప్రాణాపాయ స్థితిలో ఉందని ఫోన్ చేసి తెలిపారు. వెంటనే తమ వాహనంలో అక్కడికి చేరుకున్న జవాన్లు ఆమెను సమీపంలోని కలారూస్ ఆసుపత్రికి ఈ మంచుదారిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తరలించారు. సకాలంలో ఆమెను అక్కడికి తీసుకురావడంతో ఆమె ప్రసవించింది. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతటితో అంతా ముగిసిపోలేదు. మహిళకు ప్రసవానంతర సమస్యలు తలెత్తాయి. తిరిగి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. దీనితో తిరిగి అక్కడికి వచ్చిన ఆర్మీ జవాన్లు ఆమెను వెంటనే కుప్వారా పెద్ద ఆసుపత్రికి తరలించారు.

ఇదంతా కూడా రాత్రిపూటనే గంటల వ్యవధిలో జరిగింది. ఆసుపత్రిలో ఈ బాలింతకు చికిత్స.కిగింది. ఇప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని స్థానిక డాక్టర్లు తెలిపారు. సైన్యం సకాలంలో స్పందించి ఆదుకున్నందుకు ఈ మహిళ , ఆమె కుటుంబ సభ్యులు జవాన్లకు నమస్తేలు తెలిపారు. జమ్మూకశ్మీర్ ఇప్పుడు తీవ్రస్థాయి హిమపాతంతో తల్లడిల్లుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 1 దశను

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News