Sunday, January 19, 2025

ఉపగ్రహాలపై భారత సైన్యం 5 రోజుల పాటు పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Indian Army tested satellites for 5 days

న్యూఢిల్లీ: భారత సైన్యం జులై 25 నుంచి జులై 29 వరకు ఐదు రోజుల పాటు ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పాటవ పరీక్షలను నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అంతరిక్షంలోని తన ఉపగ్రహాల నిర్వహణకు సంబంధించిన సంసిద్ధతను నిర్ధారించుకునేందుకే ఈ పరీక్షలను నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడుతున్న కమ్యూనికేషన్, సైబర్, ఎలెక్ట్రోమ్యాగ్నటిక్ ప్రభావాలను గురించి కూడా భారత సైన్యం అధ్యయనం జరిపినట్లు వారు తెలిపారు. స్కైలైట్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్రోకు చెందిన అనేక ఉపగ్రహాల సేవలను సైన్యం వినియోగించుకుంటున్నట్లు వారు చెప్పారు. స్టాటిక్ టెర్మినల్స్, ట్రాన్స్‌పోర్టబుల్ వెహికల్ మౌంటెడ్ టెర్మినల్స్, మ్యాన్ పోర్టబుల్, స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ మ్యాన్ ప్యాక్ టెర్మినల్స్ ఉపగ్రహ కమ్యూనికేషన్ టెర్మినల్స్‌కు చెందిన పాటవ పరీక్షలను ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లు వారు వివరించారు. కమ్యూనికేషన్ టెక్నాలజీకి చెందిన ప్రభావాలను అర్థం చేసుకునేందుకు ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని భారత సైన్యం నిశితంగా అధ్యయనం చేస్తోందని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News